Sabitha Indra Reddy: మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదు లక్షల విద్యా భరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ, ఎందుకు 2 లక్షలు తగ్గింది? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 10 మంది విద్యార్థులు ఉన్న 4 వేల స్కూల్స్ ను వేరే స్కూల్స్ కి మార్చాలన్నారు. విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పదని అర్ధం అవుతుందన్నారు. 1913 జీరో ఎన్ రోల్ మెంట్ అని చెప్తున్నారని తెలిపారు. కేసీఆర్ మన ఊరు మన బడి పేరుతో విద్యా వ్యవస్థలను బలోపేతం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు 30 హామీలు ఇచ్చిందన్నారు. ఐదు లక్షల విద్యాబరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి.. కానీ ఎందుకు 2 లక్షలు తగ్గిందన్నారు.
Read also: Jagadish Reddy: ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుంది..
10 మంది విద్యార్థులు ఉన్న 4 వేల స్కూల్స్ ను వేరే స్కూల్స్ కి మార్చాలన్నారు. మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందన్నారు. మన ఊరు లో భాగంగా స్కూల్స్ లో కేసీఆర్ బ్రేక్ పాస్ట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. గురుకులాలలో పేద ప్రజలు చదువుకుంటున్నారని, వారికి విషఆహారం పెడుతున్నారని మండిప్డారు. ఇప్పటికే 49 మంది విద్యార్థులు చని పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు..సర్పంచులకు బిల్లులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం వీటిపై సమీక్షించుకోవాలని సూచించారు.
Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..