Site icon NTV Telugu

సోషల్ మీడియా లైవ్‌లో ‘మిస్ తెలంగాణ’ ఆత్మహత్యాయత్నం

miss telangana 2018 winner haasini

హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో మిస్ తెలంగాణ-2018 విజేత హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోషల్ మీడియా లైవ్‌లోనే ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఈ వీడియో చూసిన స్నేహితులు అప్రమత్తమై డయల్ 100కు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు స్పందించి వెంటనే హిమాయత్ నగర్ రోడ్ నం.6లోని యువతి ఫ్లాట్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం హాసిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు.

Read Also: తీవ్రమయిన వెన్నునొప్పితో బాధపడుతున్నారా?

కాగా ఇటీవల ఓ యువకుడు తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ హాసిని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇంతలోనే హాసిని సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది.

Exit mobile version