Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59మంది స్టూడెంట్స్ ఉండగా అందర్ని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్.. పార్టీలకి అలవాటు పడి సెల్ఫ్ గా పార్టీలను కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్ హౌస్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. అయితే, పార్టీలో పాల్గొన్న 59మంది విద్యార్థులో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు ఉండగా, మరో 17 మంది అబ్బాయిలు ఉన్నారు.
Read Also: Chairman’s Desk: క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. పొదుపు కాపాడుతుందా..?
ఇక, అక్టోబర్ 4వ తేదీన ఫామ్ హౌస్ లో పార్టీని ఇషాన్ నిర్వహించాడు. సూపర్ వైజర్ ఠాకూర్ మనీష్, డీజే ప్లేయర్లు రమేష్, రోహిత్, ఫామ్ హౌస్ ఓనర్ శేషగిరి, ఆర్గనైజర్ ఇషాన్ తో పాటు మరో ఇద్దరు మైనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, ఆదివారం ఉదయం 6 గంటలకు చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓ టీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ చదువుతున్న వారే.. ఇక, డ్రగ్ టెస్టులో ఇద్దరికి గంజాయి పాజిటివ్ గా వచ్చింది. అలాగే, 8 విదేశీ మద్యం బాటిళ్లను సైతం సీజ్ చేసేశారు.
