NTV Telugu Site icon

Minister Sridhar Babu: హరీష్ రావు చిట్ చాట్.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

Minister Sridhar Babu

Minister Sridhar Babu

Minister Sridhar Babu: చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మహేందర్ రెడ్డి నియామకంపై చిట్ చాట్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. దీంతో హరీష్ చిట్ చాట్ కు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించారన్నారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు.
కేసీఆర్ హాయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ? అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.

Read also: Alai Balai Program: మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..

చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత అన్నారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అని ప్రశ్నలు సంధించారు. విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్ అన్నారు. ఎదుటి పార్టీ వారిని చీఫ్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అన్నారు. పీఎసీ, చీఫ్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నదని చిట్ చాట్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు