Minister Sridhar Babu: హరీష్ రావు చిట్ చాట్.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
- హరీష్ రావు చిట్ చాట్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
- ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu: చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మహేందర్ రెడ్డి నియామకంపై చిట్ చాట్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. దీంతో హరీష్ చిట్ చాట్ కు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించారన్నారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. కేసీఆర్ హాయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ? అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.
Read also: Alai Balai Program: మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..
Also Read
- Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
- Koti Deepotsavam 2026: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. మూడో రోజు విశేష కార్యక్రమాలు ఇవే..!
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత అన్నారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అని ప్రశ్నలు సంధించారు. విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్ అన్నారు. ఎదుటి పార్టీ వారిని చీఫ్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అన్నారు. పీఎసీ, చీఫ్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నదని చిట్ చాట్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు
తాజావార్తలు
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!