Ponnam Prabhakar: ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నూతన బిల్డింగ్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్, వీహెచ్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న కొన్ని పనుల పూర్తికి సహకారం అందిస్తాను.. అంబర్ పేటకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తాను అన్నారు.. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలం చూపించండి.. మీకు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు కావాలన్నా ఏర్పాటు దిశగా సహకరిస్తాను అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టే.. ఈ రోజు విదేశీ పెట్టుబడులు తెలంగాణకి ఎక్కువగా వస్తున్నాయి.. ఇక, గత ప్రభుత్వం పోలీసుల సమస్యలు పట్టించుకోలేదు.. కానీ, మా ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. MRO ఆఫీస్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది
ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఇప్పుడు డీసీపీ ఆఫీస్ కట్టిన స్థలం ఒకప్పుడు కబ్జాకి గురైంది అన్నారు. ఓ రియాల్టర్ ప్లాట్లు చేసి అమ్మాలని చూశాడు.. కొట్లాడి భూమిని కబ్జా నుంచి కాపాడిన.. నాకు 2 వేల గజాలు ఇస్తానని ఆఫర్ చేసినా కూడా పట్టించుకోలేదు.. అంబర్ పేటలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు సీఎం చొరవ చూపాలి అని కోరారు. స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం చాలా గొప్పది.. స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు ఐతే.. పోలీసులకు కూడా ఉపయోగకరం.. ఒకప్పుడు హైదారాబాద్ ఫుట్ బాల్ టీమ్ చాలా గొప్పగా ఉండే.. ఇప్పుడు ఫుట్ బాల్ లేకుండా పోయిందన్నారు. హైదారాబాద్ సీపీ కూడా క్రికెట్ చాలా బాగా ఆడుతాడు.. మొన్న చూసా.. అద్భుతంగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తాడు అని వీహెచ్ పేర్కొన్నారు.
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది
కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ కి పెద్ద చరిత్రే ఉందని తెలిపారు. ఒకప్పుడు రెండు జోన్ లు మాత్రమే ఉండేవి.. 2001లో ఈస్ట్ జోన్ డీసీపీగా చేశాను.. కృష్ణా జిల్లా నుంచి హైదారాబాద్ ఈస్ట్ జోన్ కి బదిలీపై వచ్చాను అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈస్ట్ జోన్ కి ఒక ఆఫీస్ లేదు.. ఇప్పుడు నూతన బిల్డింగ్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. నగరంలో ఇంకా 20 నుంచి 25 పోలీసు స్టేషన్లకు సరైన కార్యాలయాలు లేవు.. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి అన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని సీపీ ఆనంద్ వెల్లడించారు.