NTV Telugu Site icon

Ponnam Prabhakar: మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ కు పొన్నం ప్రశ్న..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రతిపక్షం గుడ్డిగా మాట్లాడుతుందని మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాలి అని మా ప్రయత్నం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయ్యాకా.. ప్రారంభానికి వస్తా అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తం అన్నం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండె కాయ లాంటిదని తెలిపారు. రిడిజైన్ చేసిన ఇంజనీర్ కానీ ఇంజనీర్ కేసీఆర్ కట్టుకథలు అల్లారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగిపోతే.. కుట్ర జరిగింది అన్నారని తెలిపారు. మిడ్ మానే రు నుండి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఎల్లంపల్లి నుండే అని క్లారిటీ ఇచ్చారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకున్నది ప్రభుత్వం అన్నారు.

గౌరవెల్లి నీ కూడా నింపుకోవాలి అని మేము చూస్తున్నామని తెలిపారు. మల్లన్న సాగర్ పోటీపడి.. హరీష్ రావు హడావుడి చేసి మల్లన్న సాగర్.. ఎల్లంపల్లి నుండి నింపిందే అన్నారు. మల్లన్న సాగర్ నింపినందుకు అభినందనలు చెప్తారు అనుకున్నామన్నారు. హరీష్ సమాధానం చెప్పాలి.. మల్లన్న సాగర్ కి వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం లో అంతర్భాగం అనడం కాదన్నారు. ఎల్లంపల్లి నీళ్ళతో నే మల్లన్న సాగర్ నిండిందని తెలిపారు. ఎల్లంపల్లి నువ్వు కట్టినవా? అని ప్రశ్నించారు. మిడ్ మానే రు స్టార్ట్ చేసింది నేను.. పేరు మార్చినంత మాత్రానా.. ప్రాజెక్టుల రూపం మారదన్నారు. కాళేశ్వరం ఫెయిల్ ప్రాజెక్టు.. కాళేశ్వరం కుంగి పోయినప్పుడు అధికారం లో మేము లేమన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అని కమిషన్ తేల్చుద్ది అని తెలిపారు.
CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..