NTV Telugu Site icon

Komatireddy Vs Harish: కోమటిరెడ్డి కి హాఫ్‌ నాలెడ్జ్‌ – హరీశ్‌ రావు వద్ద సబ్జెక్ట్‌ లేదు..

Harish Rao Komati Reddy

Harish Rao Komati Reddy

Komatireddy Vs Harish: అసెంబ్లీలో మాటల యుద్దం కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. కోమటిరెడ్డికి హాఫ్‌ నాలెడ్జ్‌ తో మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా? అన్నారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలన్నారు. ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహాలక్ష్మీ పథకా​న్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారన్నారు. దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలన్నారు. గృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. యువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదని తెలిపారు. చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదన్నారు.

Read also: Harish Vs Revanth: పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్.. రేవంత్ రెడ్డి కౌంటర్..

హరీష్ రావు మాటలకు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు వద్ద సబ్జెక్ట్‌ లేదని అన్నారు. అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్సే అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు. దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.. ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడన్నారు. గతంలో హరీష్ రావు ఒక డమ్మీ మంత్రి అన్నారు. కేసీఆర్‌ సభుకు రాలేక హరీష్ రావును పంపారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

Harish Rao vs Bhatti Vikramarka: నేను ఒప్పుకున్నానా..? హరీష్ పై భట్టి ఫైర్