NTV Telugu Site icon

Minister Komatireddy: అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komati Reddy

Minister Komati Reddy

Minister Komatireddy: హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతుందన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ లో 5 వేల కోట్లు దోచుకుతిన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకు అంటే గుర్తు పడతారు కాని.. కేటీఆర్ అంటే ఎవరూ గుర్తు పట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయినా అహం తగ్గలేదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వేల కోట్లు సంపాదించి ఎక్కడ పెట్టుకోవలో తెలియని డబ్బులు సంపాదించారన్నారు. అరె కేటీఆర్ నల్గొండ మంత్రులు రెచ్చగొడితే రెచ్చి పోరు.. స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులము అన్నారు.

Read also: Bandi Sanjay: నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్న.. గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్..

ఎవరో చెబితే వాళ్ళము కాదు నల్గొండ వాళ్ళమన్నారు. నల్గొండలో అనారోగ్యం బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని, ఎన్నో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎస్టీపీలతో సమస్య పరిష్కారం కాదు.. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ ఇంకా ఏవో పేర్లు చెప్పి 7 లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. మాకు పదేళ్ల కింద 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. కేటీఆర్ తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసేదే చెప్పాము.. మీ లాగా అమలు కానీ హామీలు ఇవ్వలేదన్నారు. ఎంత కష్టం అయినా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. మీకు కేటీఆర్, హరీష్ కు ఏం పుట్టింది మీకు రాజకీయాలు వస్తాయా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓడిపోయిన బిఆర్ఎస్ వాళ్ళు వేరే దేశంకు వెళ్లి బ్రతుకుతారు అనుకున్నా.. కానీ సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు.


Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..