Site icon NTV Telugu

Revanth Reddy: రేవంత్‌రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Online Payment: 2 కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన ఆన్‌లైన్ పేమెంట్.. చివరికిలా..!

త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారు. స్థానికంగా పార్టీ కోసం కష్టపడేవారికి నామినేటెడ్ పోస్టులు కట్టబడితే.. వారంతా పార్టీ కోసం మరింత కష్టపడతారని భావిస్తున్నారు. అలాగేే పార్టీ సంస్థాగణ నిర్మాణంపై కూడా దృష్టిపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Warangal: వరంగల్‌లో ఎస్సై వీరంగం.. రెస్టారెంట్‌లో మహిళపై దాడి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు కీలకాంశంగా ఉంది. లోకల్​బాడీ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చిస్తున్నారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తేలే వరకు ఆగాలా లేక ముందే ఎన్నికలకు వెళ్దామా అనే అంశంపై పీఏసీ సమావేశంలో నేతల అభిప్రాయ సేకరణ చేసే అవకాశాలున్నాయి.

Exit mobile version