NTV Telugu Site icon

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న, తెలంగాణలో విగ్రహం.. అసెంబ్లీలో సీఎం..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని, తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెడతామని సీఎం పేర్కొన్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కు అసెంబ్లీలో నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు.

Read also: Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ సింగ్‌ కృషిని కొనియాడారు. ఉపాధి హామీ, ఆర్టీఎల్‌ లాంటి చట్టాలు తెచ్చిన ఘటన మన్మోహన్‌ సింగ్‌ది అన్నారు. సరళీకృత విధానాలతో భారత్‌.. ప్రపంచంతో పోటీ పడేలా చేశారు. దేశానికి మన్మోహన్‌ సింగ్‌ విశిష్టమైన సేవలు అందించారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్‌ సింగ్‌ది కీలకపాత్ర అన్నారు.

Read also: TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి..

ఈతరంలో మన్మోహన్‌ సింగ్‌తో పోటీపడేవారే లేరని అన్నారు. ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా.. పనినే ధాసగా మన్మోహన్‌ భావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక విధానాన్ని సుస్థిరంగా ఉంచగలిగిన వ్యక్తి మన్మో హన్ సింగ్ అన్నారు. ఉపాధి హామీ సమాచార హక్కు లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ది అని రేవంత్‌ తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అన్నారు.

Read also: Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో నేను(రేవంత్‌రెడ్డి) వెళ్లి పరిచయం చేసుకున్నా అన్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి… నాకు(రేవంత్‌ రెడ్డి) చెప్పిన మాట.. మన్మోహన్ సింగ్ కి తెలంగాణ అంటే ఎంతో ప్రేమ అని తెలిపారు. కష్టపడి పని చేయండి…ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎన్నో విలువలతో నడిపించారని సీఎం పేర్కొన్నారు.
KTR Tweet: ఇది కక్ష్యా ? శిక్ష్యా? నిర్లక్ష్యమా ?.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్

Show comments