Site icon NTV Telugu

Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్‌లో మల్లన్న మాస్‌ స్టెప్పులు..

Mla Mallanna

Mla Mallanna

Malla Reddy Mass Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్‌చల్‌ చేస్తుంటారు. ఆయన డ్రైలాగులకు అందరూ ఫ్యాన్సే.. పూలమ్మినా, పాలమ్మినా అనే డైలాగుతో ఆయన ఓ రేంజ్ లో పాపుల్ అయ్యారు. మల్లన్న చెప్పే డైలాగులు ఒక ఎత్తైతే.. ఆయన ఎక్కడి వెళ్లిన హల్ చల్ చేయడం పక్కా ఉంటుంది. ఆయన మాటలతోనే కాదు స్టెప్పులతోనూ కూడా అందరి దృష్టి ఆకట్టుకుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ ను ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. పెళ్లిలో ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిన మల్లన్న డీజే టిల్లు పాటకు స్టేజ్ దద్దరిల్లేలా స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.


Big Breaking: గ్రూప్‌ 1 పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

Exit mobile version