NTV Telugu Site icon

Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు.. శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం జరుగునున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ , పూజనీయ RSS సరసంఘ్ చాలక్ మోహన్ భాగవత్ , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా.. 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. లోక్ మంథన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సారి శిల్పకళా వేదికగా హైదరబాద్ లో జరుగుతుందని తెలిపారు. ఈనెల 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు.

Read also: Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17 నుంచి ఎస్‌సీఆర్‌ 26 ప్రత్యేక రైళ్లు..

భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం అన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన బోతున్నట్లు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యా వేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు. సముద్ర మథనం ఎలా జరిగిందో అలా ఈ లోక్ మంథన్ జరుగుతుందని తెలిపారు. వనవాసి, నగర వాసి, గ్రామ వాసి ఈ మూడు కలిస్తే నే దేశం అన్నారు. దురదృష్టవశాత్తూ కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. భీర్సా ముండా జయంతి నీ గిరిజన గౌరవ దినం గా కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తుందని గుర్తు చేశారు. 21 న స్టాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం వెంకయ్య నాయుడు చేస్తారని తెలిపారు. 22 వ తేదీ న ఈ లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారన్నారు. ప్రజలు అందరూ , అన్ని వర్గాల వాళ్ళను ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Gold Rate Today: పసిడి తగ్గుదలకు బ్రేక్.. పెరిగిన బంగారం ధరలు!

Show comments