NTV Telugu Site icon

Hyderabad airport: హైదరాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు నేరుగా విమానాలు.. లిస్ట్ ఇదే..

Direct Flights From Hyderabad Airport

Direct Flights From Hyderabad Airport

Hyderabad airport: హైదరాబాద ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి హైదరాబాద్‌‌కి నేరుగా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది 2.3 మిలియన్ల మంది ప్రయాణించారు. 2023 డిసెంబర్ నెలలో 11 శాతం, గతేడాది 18 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 23, 2023న అత్యధిక సింగిల్ డే ప్యాసింజర్ ట్రాఫిక్‌ని చూసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కి నేరుగా విమానాన్ని ప్రారంభించింది.

Read Also: PM Modi: “ఇలాగే జరుగుతూ ఉంటుంది”.. సీఎం సిద్ధరామయ్యతో పీఎం మోడీ..

హైదరాబాద్ నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు.. లిస్ట్:

దుబాయ్
మస్కట్
దోహా
అబూ ధాబీ
జెడ్డా
సింగపూర్
కౌలాలంపూర్
దమ్మామ్
షార్జా
రియాద్
కువైట్
కొలంబో
బహ్రెయిన్
బ్యాంకాక్
లండన్
ఢాకా
హాంగ్ కాంగ్
ఫ్రాంక్‌ఫర్ట్
బ్యాంకాక్
మాలే
రాస్ అల్ ఖైమా