Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Lal Darwaja Bonalu Started Traffic Restrictions

Lal Darwaja Bonalu: ప్రారంభమైన లాల్‌ దర్వాజా బోనాలు.. బోనం ఎత్తిన పాత బస్తీ..

Published Date :July 28, 2024 , 9:33 am
By Bhanu
  • ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు..
  • ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు..
Lal Darwaja Bonalu: ప్రారంభమైన లాల్‌ దర్వాజా బోనాలు.. బోనం ఎత్తిన పాత బస్తీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lal Darwaja Bonalu: హైదారబాద్ లోని ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం వద్ద భక్తుల కొలహలం నెలకుంది. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు అధికారులు. అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు బోనాలు సమర్పించే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖల సమన్వాయంతో ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉండనుంది. సుమారు 500 కు పైగా పోలీస్ బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. బోనాలు సందర్బంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు రెండు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.

Read also: Hyderabad Crime: ఎస్ ఆర్ నగర్ లో దారుణం.. హాస్టల్ లో యువకుడి హత్య..

మరి కొద్దీ సేపట్లో ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పాతబస్తి లోని ప్రధాన 23 ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మీరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇక.. లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాత బస్తీలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, బహుదూర్‌పురా, మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈనెల 28, 29 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు పాతబస్తీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగుతుంది. కాగా.. లాల్ దర్వాజ దేవాలయం, ఎంజీబీఎస్, రెతిఫైల్, జేబీఎస్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు… సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.

Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HYDERABAD News
  • Lal Darwaja Bonalu
  • old city
  • Telangana Festivals
  • Traffic restrictions

తాజావార్తలు

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions