KTR: ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది..దానిలో ఏమి అనుమానం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేపు కోర్టు లో చెబుతాం.. ఏ కేసులో దూకుడుగా లేని ఈడీ… ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. నేను ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తున్నాను.. కోర్టు ఏమి చెబుతోంది.. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు కదా అన్నారు. మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక సమావేశం పెట్టారు..పీవీ ని కూడా గౌరవించాలన్నారు. పీవీ కి కూడా న్యాయం జరిగే దాకా కొట్లాడతామన్నారు. 2025 సంవత్సరం లో కమిటీ లు ఉంటాయి, సంస్థాగత నిర్మాణం ఉంటుందన్నారు. సభ్యత నమోదు ఉంటుందన్నారు. అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంటుందని కేటీఆర్ అన్నారు. బహిరంగ సభ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
Read also: KTR: ఈ సంక్రాంతి కి రైతులకు ప్రభుత్వం టోకరా ఇవ్వబోతుంది..
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచం లాగా ఇక్కడ బీజేపీ ఎంపీ లు, కేంద్ర మంత్రులు ఉన్నారని తెలిపారు. అందుకే అమృత్ టెండర్ లపై కేంద్రం నోరు విప్పట్లేదన్నారు. పనికి మాలిన కేస్ లు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అక్రమ కేస్ లు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి గా నిర్ణయం తీసుకున్నాను అని మొదటి రోజు చెప్పానని ..ఇప్పుడు కూడా అదే మాటకు చెప్తున్నానని తెలిపారు. ప్రొసీజర్ లో తప్పులు ఉంటే ఎన్నికల కమీషన్ ని అడగండి అన్నారు. రేపు కోర్ట్ ముందుకు వస్తుంది.. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను అన్నారు. దీనిలో అవినీతి జరగలేదు అని వాళ్లకు కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. మొన్న సీఎం చిట్ చాట్ లో కూడా అవినీతి ఎక్కడ జరిగింది అంటే.. చెప్పలేక పోయారని కేటీఆర్ గుర్తుచేశారు.
Pawan Kalyan: గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన పవన్!