NTV Telugu Site icon

KTR Tweet: సీఎం రేవంత్‌ రెడ్డికి బర్త్‌ డే విషెస్ చెప్పిన కేటీఆర్.. ఎక్స్ లో సెటైర్లు..

Ktr Tweet

Ktr Tweet

KTR Tweet: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావచ్చు. వారికి నా స్వాగతం. వారితో మీ పుట్టినరోజు కేక్ కట్ చేయాస్తా. టీ, బిస్కెట్లు కూడా ఇస్తాను అని ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ సెటైర్లు వేశారు. అయితే.. కాగా, అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారని పలు మీడియా కథనాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసు. జర్నలిజాన్ని జోక్ మార్చకండి అన్నారు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు . ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్, ఇవాళ సీఎం పుట్టిన రోజూ సందర్బంగా స్పందిస్తూ.. నేను ఎక్కడికి వెళ్లలేదు హైదరాబాద్‌ లోనే వున్నా ఎప్పుడైనా రావచ్చు అంటూ సెటైర్లు వేశారు.

Read also: Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..

కేటీఆర్ మరో ట్వీట్

నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్‌ రెడ్డి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్‌ లిస్ట్ చెయ్యడానికి! అని ప్రశ్నించారు. దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి? ని మండిపడ్డారు. దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్‌’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసివేయడానికి? అని తెలిపారు. దమ్ముందా? లేదా? అని సీఎంకు ట్వీటర్ వేదికగా సవాల్ విసిరారు. సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర పైన కేటీఆర్ కామెంట్స్ చేశారు.

Read also: MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు.. ప్రభాత్‌ హెచ్చరిక లేఖతో అలర్ట్..

సీఎం గారు.. అంటూ కేటీఆర్ మరో ట్వీట్ వైరల్ గా మారింది. పుండు ఓ చోటైతే.. మందు ఓ చోట..అన్నట్టుగా ఉంది మీ పాదయాత్ర తీరు అంటూ మండిపడ్డారు. మీ మూసీ ప్రాజెక్టు బాధితులు ఉన్నదెక్కడ ? మీరు పాదయాత్ర చేస్తున్నదెక్కడ ? అని ప్రశ్నించారు. వేల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే స్కెచ్ గీసి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్లాన్ వేసి,దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర పేరిట డ్రామా చేస్తారా ? అని మండిపడ్డారు. లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్ గా మారిన.. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి మీకుందా ? అని సవాల్ విసిరారు. అసలు మూసీని మురికికూపంగా మార్చింది.. మీరు ఊరేగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలే.. అన్నారు. దశాబ్దాలపాటు దరిద్రమైన వ్యర్థాలు కలుస్తుంటే.. అరవై ఏళ్లు అటువైపు కళ్లుండీ చూడని కబోదులు మీరు అన్నారు.

Read also: Social Media Posts: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్‌ వార్నింగ్‌..

కనికరం లేకుండా కాల్చిచంపిన దోషులే.. సంతాప సభకొచ్చి కన్నీరు కార్చినట్టుంది.. మీరు నిస్సిగ్గుగా చేపట్టిన పాదయాత్ర తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేయాల్సింది.. పాదయాత్ర కాదు.. ఆ రైతులను క్షమాపణలు కోరుతూ మోకాళ్ల యాత్ర అన్నారు. మూసీ లూటిఫికేషన్ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో.. మూడు రోజులపాటు చర్చలకు టైం ఉంది కానీ.. గ్యారెంటీలపై సమీక్షకు గంట కూడా సమయం లేదా.. ? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని మోసపూరిత హామీలను పక్కనపెట్టి, మూసీ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకున్నారంటేనే.. కమీషన్లు తప్ప.. కామన్ మ్యాన్ గురించి మీకు ఏ మాత్రం పట్టిలేదని తేలిపోయింది.. అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు పాదయాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా..మూసీ పేరిట చేస్తున్న లక్షన్నర కోట్ల పాపం మిమ్మల్ని శాపమై వెంటాడటం ఖాయమని కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.
NFL Recruitment 2024: నేడే చివరి తేదీ.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్