Site icon NTV Telugu

BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Brs Ktr

Brs Ktr

BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారని మండిపడ్డారు. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారన్నారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారని తెలిపారు. కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు.

Read also: Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్‌..

రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తి పై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారని తెలిపారు. కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? అని ప్రశ్నించారు. సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారని తెలిపారు.

Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..

సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారన్నారు. మా నేత నరేందర్ రెడ్డి చాలా ధ్యైర్యంగా ఉన్నాడు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారని తెలిపారు. మహబూబాబాద్ లో మేము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారన్నారు. నరేందర్ రెడ్డి చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీ వెనుక కేసీఆర్ ఉన్నారని భరోసా ఇచ్చారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు.. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందన్నారు.
Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుంది..

Exit mobile version