NTV Telugu Site icon

KTR Viral Tweet: ప్రజాపాలన కాదు ఇది.. ప్రతీకార పాలన.. కేటీఆర్‌ ట్వీట్ వైరల్‌

Ktr Revanth Reddy

Ktr Revanth Reddy

KTR Viral Tweet: ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం.. కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మండిపడ్డారు. ఓ మహిళా ఉద్యోగిని తనకు జీతం రాలేదని ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలిగించారనే దానిపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆమె జీతం రూ.15 వేలు కాగా, జీతంలో కోత పెట్టి ఏజెన్సీ రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఆమె ప్రజాభవన్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ మరుసటి రోజు రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది.

Read also: Kunamneni Sambasiva Rao: ‘హైడ్రా’ అనే పేరు భయానకంగా ఉంది.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

నిన్న (మంగళవారం) సాయంత్రం ప్రజాభవన్‌కు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు జీతంలో కోత పెట్టి ఇస్తున్నారని ఫిర్యాదు చేస్తూ ఉద్యోగమే లేకుండా చేశారంటూ.. తిరిగి తన ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన తమను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించిందని వాపోయారు. ప్రజావాణిలో ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువగా ఉందని విమర్శించారు. ఇది ప్రజల పాలన కాదని.. ప్రతీకార పాలన అని వాదించారు. రేణుకను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్ ద్వారా ఎంతమంది పేదల సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

Show comments