NTV Telugu Site icon

KTR: హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. రెండు వారాల తర్వాత నగరానికి..

Ktr

Ktr

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు చేరుకున్న కేటీఆర్‌ నేరుగా నందినగర్‌ వెళ్లారు. అనంతరం తన ఇంటికి పయనం అయ్యారు. ఇక ఇవాళ కేటీఆర్‌ రెస్ట్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. రేపటి నుంచి మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వెళతారని పార్టీశ్రేణులు తెలిపారు. గత కొన్ని నెలలుగా మార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ అమెరికా వెళ్లిన తర్వాత.. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

Read also: Eating Eggs: వావ్‌.. మహిళలు గుడ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా?

కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా జరిగిన ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నం? మన రాష్ట్రం ఎటు పోతోంది? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణ అడ్డంకిగా మారడం బాధాకరం. కౌశిక్ రెడ్డిని అరికెపూడి గాంధీ గ్యాంగ్ లు గృహనిర్బంధంలో ఉంచి దాడి చేస్తారా?. ఇందిరమ్మ పాలన అంటే ఎమ్మెల్యేకి కూడా రక్షణ లేదంటారా?. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతూనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పోరాడుతున్నందుకే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలా తుమ్మల స్వింగ్ దాడులు బెదిరించవు. ఇకపై ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు రెండు వారాల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేటీఆర్.. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Plastic Bottles: ప్లాస్టిక్‌ బాటిల్‌ లో పిల్లలకు పాలు.. ఈ విషయం తెలుసుకోండి..

Show comments