ప్లాస్టిక్ వాడటం కారణంగా ఏకంగా పర్యావరణ కాలుష్యం విపరీతంగా జరుగుతుంది. అంతేకాదు మనిషి మనుగడకే ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలు అందరికీ తెలుసు.

ప్రతి మనిషి వారి వారి జీవితాల్లో నుంచి ప్లాస్టిక్ నూ దూరం పెట్టలేకపోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక భాగంగా మారిపోయింది.

 ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపుదిద్దాలి అని ఎంతలా పిలుపునిస్తున్నప్పటికీ ఇక ప్లాస్టిక్ వాడకం మాత్రం అస్సలు తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. 

మనం వాడే వస్తువుల దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో కూడా ఏకంగా ప్లాస్టిక్ కలుస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

ఈ మధ్య తినే ప్లేట్స్ దగ్గరనుంచి నీళ్లు తాగే గ్లాసెస్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇలా ప్లాస్టిక్ తో తయారైనవే ఎక్కువగా వాడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. 

చివరికి పిల్లలకు పాలు తాగించే బాటిల్స్ కూడా ఇలా ప్లాస్టిక్ వే ఉంటున్నాయి. ఇలా పూర్తిగా మనిషి జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక భాగంగా మారి పోయింది. 

ఇలా ప్లాస్టిక్ను అతిగా వినియోగిస్తే ప్రమాదం తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు ఇస్తే ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

వేడి చేసిన పాలను ప్లాస్టిక్ బాటిల్లో పోస్తే మైక్రో ప్లాస్టిక్ పిల్లల కడుపులోకి వెళ్లి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట. 

ఇది వారి ఎదుగుదల రోగనిరోధక శక్తి వ్యవస్థ పై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. హై క్వాలిటీ స్టీల్ బాటిల్ లేదంటే గ్లాస్ లో  పాలు ఇవ్వడం ఎంతో సురక్షితం అంటూ చెబుతున్నారు.