NTV Telugu Site icon

BRS Leaders: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం..

Ktr Harish Rao

Ktr Harish Rao

BRS Leaders: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని తెలిపారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలిపారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదరం.. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదంటూ కేటీఆర్ హెచ్చరించారు.

Read also: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్.. ఇవాళ అమిత్​ షాతో భేటీ..

మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని హరీష్ రావు మండిపడ్డారు. పక్కా ప్లాన్ తోనే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజా పాలన, ఇది ఇందిరమ్మ రాజ్యం. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడమే కాకుండా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఉసిగొల్పి దాడి చేయడం దుర్మార్గంగా అభివర్ణించారు. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో దాడి జరిగిందని ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ అనుచరులు కౌశిక్‌పై రాళ్లు, గుడ్లు, టమోటాలతో దాడి చేశారు. ఎమ్మెల్యేకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
Arikepuri Gandhi Arrest : అరికెపూడి గాంధీ అరెస్ట్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Show comments