NTV Telugu Site icon

Konda Surekha: కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు..

Konda Surekha

Konda Surekha

Konda Surekha: హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ.. హుజరాబాద్ ఎమ్మెల్యే వాడో పిచ్చోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని అన్నారు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టి డాన్సులు చేసే సంస్కృతి ఇంతకుముందు అసెంబ్లీలో లేకుండే అన్నారు. మెదడు లేకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మీద మీ అయ్య (కేసీఆర్)తో మాట్లాడించు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Ponnam Prabhakar: చంచల్ గూడ జైల్లో దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి పొన్నం

అధికారంలో ఉన్నప్పుడు నువ్వే రాజు నువ్వే మంత్రి అన్నట్టు నడిపించావని కేటీఆర్ పై మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూడా అంతా నువ్వే అన్నట్టు నడిపించాలనుకుంటున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దోచుకుని.. మీ కుటుంబం బాగు పడిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మీలాగా రేవంత్ అనుకుంటున్నారు.. మీలాగా కాదు మేము అన్నారు. కేటీఆర్ ఎక్కడ పోయినా వెళ్లగొడుతున్నారని కొండా సురేఖ తెలిపారు. ఆటో వాళ్ల దగ్గరికి పోతే పొమ్మన్నారు..
గిరిజనుల దగ్గరికి పోతే వద్దు పొమన్నారు.. ఎమ్మెల్యేల స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నారని కేటీఆర్ పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

Read also: Hashish Oil: చందానగర్‌లో లక్షల విలువైన హషిష్ ఆయిల్ పట్టివేత..

మీరు పెట్రేగి పోతే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ తల్లి నీ కేటీఆర్ దొరసాని లెక్క చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత లెక్క వడ్డాణం.. దొరసాని లాగ పెట్టుకున్నారన్నారు. మేము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నాం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని వారందరినీ ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నాడు కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక.. ఇప్పుడు మేము ఏం చేసినా ఉద్యమాలు చేస్తామనీ అంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసినవన్నీ ఉత్తిత్తి రాజీనామాలే అని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారని గుర్తుచేశారు.
Harish Rao Arrest: పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలింపు..

Show comments