NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: హాట్‌ కామెంట్.. కేసీఆర్ స్థానంలో నేనుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని..

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ స్థానంలో నేను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ళళ్లలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైనదని అన్నారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టినం అన్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశామన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కిందన్నారు. కేంద్రం సహకరించకున్నా.. అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టగలిగామన్నారు. కేంద్రం తన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Read also: MLC Kavitha: కవిత‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

బీజేపీ తో బీఆర్ఎస్ విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లు మాకు సమాచారం ఉందన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ వడ్డీలు కట్టవలసి వస్తుందన్నారు. కేసీఆర్ స్థానంలో నేను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు కూలీలకు ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సిద్ధం అవుతుందన్నారు. స్కిల్ యూనివర్సిటీ.. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వంద శాతం బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుర్చీ బచావో ప్రభుత్వం అన్నారు. నీతి అయోగ్ సమావేశాన్ని దక్షణాది రాష్ట్రాలు బహిష్కరిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని మండిపడ్డారు.
Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి ?

Show comments