NTV Telugu Site icon

Komatireddy: భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి దంపతులు..

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాలతో సందడి నెలకొంది. లాల్‌దర్వాజ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ పండుగలు కొనసాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. అమ్మవారు కరోనా లాంటి కరోనా బారి నుంచి ప్రజలందరినీ కాపాడాలన్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులంతా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని అన్నారు.

Read also: Bandi Sanjay: భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం..

పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అఖిలపక్ష నిర్ణయం మేరకు పాత డిజైన్‌తో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తాం. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం. పాతబస్తీ స్థితిని మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మేడిగడ్డ కుప్పకూలినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందని తెలిపారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు కుట్రలు పన్నితే డ్యామ్ ఎలా కూలిపోతుంది? పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Deputy CM Pawan Kalyan: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం

Show comments