Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు..
- కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. సీఎం విచారణ కోరారా?..
- తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి..
- వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి..
- కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్న కిషన్ రెడ్డి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే చెప్పడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది మా డిమాండ్ అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. సీఎం విచారణ కోరారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పు. కానీ గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. ఆయన తన ప్రజలతో మాట్లాడాలని తెలిపారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందన్నారు.
Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారు..
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!