NTV Telugu Site icon

Kishan Reddy: బుల్డోజర్ లతో ఎలా తొక్కిస్తారో చూస్తాం.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బుల్డోజర్ లతో తొక్కిస్తారు ఆట చూస్తాం.. తొక్కేయడం ఎలా తొక్కిస్తారో.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేము చావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మూసి ప్రక్షాళన చేయండి.. పేదల ఇల్లు కూలకొట్టకండి.. ఇది మా నినాదం అన్నారు. పేదల తో రేపు అక్కడే ఉంటాం.. ప్రజలకు భరోసా ఇస్తామన్నారు. బీజేపీని రెచ్చగొడి తే ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా కదలదన్నారు. పేదల మీద నా యుద్ధం.. పేదల కష్టార్జితంను తొక్కిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 ఏళ్లకు ఎమ్మెల్యే లుగా పోటీ చేయాలనే డిమాండ్ కు మేము వ్యతిరేకం కాదన్నారు. పార్లమెంట్ లో చట్టం చేయాలి… అందరూ ఒప్పుకోవాలన్నారు. మేము కాకపోతే మీరు.. మీరు కాకపోతే మేము అని కాంగ్రెస్, బీఆర్ఎస్ కదులుకున్నాయన్నారు. తెలంగాణలో మేము అధికారం కోసమే ముందుకు వెళ్తామన్నారు. బాధ్యత గల సీఎం తన సొంత నియోజక వర్గంలోనే పరిస్థితి ఇంత వరకు తీసుకురావాల్సి ఉండాల్సింది కాదన్నారు. అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగితే విచారణ జరగాల్సిందే అన్నారు. కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు.

Read also: Minister Anagani: 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్‌ చేశారు.. ఎంతటి వారున్నా శిక్షిస్తాం: మంత్రి అనగాని

కేటీఆర్ పై చర్యల విషయంలో గవర్నర్ న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తారన్నారు. గవర్నర్ కి విచక్షణ లేదా.. ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆయన డైలీ 2 డైలీ యాక్టివిటీ లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందన్నారు. రైతు భరోసా ఎకరానికి 15 పైసలు రాలేదన్నారు. పంటలకు బోనస్ అన్నారు బోగస్ చేశారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వంకి లేదన్నారు. పోలీస్ వ్యవస్థ ను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందన్నారు. గతంలో ఫార్మ్ హౌస్ లో వీడియోలు తీసి బీఆర్ఎస్, కేసీఆర్ ఏ విధంగా ఉపయోగించుకున్నారో రేవంత్ రెడ్డి కూడా అలానే చేస్తున్నారని తెలిపారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంంటే పోలీస్ లు, ప్రభుత్వం ఏమీ చేస్తుంది? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో పోలీస్ కమిషనర్ బదిలీ చేశారన్నారు. హిందువుల మీద కేసులు పెడుతున్నారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లో పోలీసులు పని చేసున్నారన్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.

Read also: Pakistan : పాకిస్తాన్‌లో అధ్వాన్నమైన పరిస్థితి.. ఆస్పత్రిలో చేరిన 15 వేల మంది

చర్చల ద్వారా పరిష్కరించాల్సిన వ్యవహారం కలెక్టర్ పై దాడి వరకు వచ్చిందన్నారు. సీఎం సొంత నియోజక వర్గంలోనే దాడి జరగడం, రైతులను అరెస్ట్ చేయడం ఎక్కడికి వెళ్తుంది తెలంగాణ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్ని నడి రోడ్డు పైన కెసిఆర్, రేవంత్ రెడ్డి వదిలి వేశారన్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. అభివృద్ది కుంటుబడిందన్నారు. మీరు మమ్మల్ని తిట్టండి మేము మిమ్మల్ని తిడుతం అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. డూప్ ఫైటింగ్ లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చార లేదా అనేది ప్రధాన ఇష్యూ.. కేసులు కాదున్నారు. కాంగ్రెస్ కు ఏటీఎం గా తెలంగాణ రాష్ట్రం అని కీలక వ్యఖ్యలు చేశారు. పెన్షన్ లు పెంచే పరిస్థితి లేదు… ఏ ఒక్క కార్యక్రమం సమర్థంగా అమలు చేసే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు, విమర్శలతో రాజకీయాలు చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీ లతో తెలంగాణ కు ఒరిగేది ఏమీ లేదన్నారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానలు, గ్రామ పంచాయతీ లకు నిధులు, రేషన్, ధాన్యం కొనగోలు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు.
Health Tips: బాబోయ్‌.. ఆవలింత వల్ల ఇన్ని కష్టాలా?