NTV Telugu Site icon

Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన కేసీఆర్ ది.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆనాటి సీఎం.. నేను రాజుని.. నా కొడుకు యువరాజు అనే రీతిలో వ్యవహరించారని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన కేసీఆర్ ది.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఆయన వల్లనే అన్నారు. వ్యవస్థ కుప్ప కూలిపోయింది. రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ లు కూడా రావడం లేదన్నారు. ఐఏఎస్ అధికారులతో కాళ్ళు మొక్కించుకున్న చరిత్ర వాళ్లదన్నారు.

Read also: Rajanna Sircilla Crime: భార్యను చంపి.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య..?

ఒక్కడే ఐపోయాడు జగదీష్ రెడ్డి పాపం అన్నారు. అంతకు ముందు 13 మంది ఉండే అని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ నుండి వెయ్యి మెగావాట్ల కరెంట్ కొంటాం అని ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ నిర్ణయాల వల్ల వేల కోట్లు అప్పుల పాలు అయ్యారన్నారు. వాళ్ళు సభలోకూడా మమ్మల్ని మాట్లాడించి వాళ్ళు కాదన్నారు. వంద మంది కౌరవుల లెక్క వ్యవహారం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అని తెలిపారు. ఐదుగురం ఉన్న మా మీద దాడి చేసే వాళ్ళు.. నన్ను కొట్టడానికి కూడా వచ్చే వాళ్ళు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Cast Reservation : బీహార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?