NTV Telugu Site icon

Kishan Reddy: వక్ఫ్ బోర్డు బిల్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: వక్ఫ్ బోర్డు బిల్ తెచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ ఆస్తులు కబ్జా కాకుండా ఉండేందుకు ఈ బిల్ తీసుకువచ్చామని అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు చేస్తున్న పనికి మూడింతలు పనిచేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తుందన్నారు. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగే విధంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట, గిట్టుబాటు ధర అన్నారు. వరల్డ్ మానుఫాక్చరింగ్ హబ్ గా భారత్ అవతరించాలనే లక్ష్యం తో స్మార్ట్ సిటీల ఏర్పాటు నిర్ణయం అన్నారు. అందులో జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్ష 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

ముద్ర పథకం కిందా ఇచ్చే రుణ పరిమితి నీ 20 లక్షలకు పెంచామన్నారు. 10 హై లెవెల్ పోర్ట్ ల నిర్మాణం చేశామన్నారు. మల్కాన్ గిరి భద్రాచలం మధ్య రైల్వే లైన్, నిధుల మంజూరు చేశామన్నారు. ఎలక్ట్రికల్ అంబులెన్స్ లకి ప్రోత్సహం కలిగించామన్నారు. వంద రోజుల్లో 10 కొత్త వందే భారత్ ట్రెయిన్ లు అందులో ఒకటి తెలంగాణ కు కూడా ఉందన్నారు. 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణలో 12 లక్షల మందికి అదనంగా లబ్ధి… రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమలు చేస్తున్నామన్నారు. మెడిసిన్ సీట్ల భారీగా పెంచామన్నారు. క్రీడల ప్రోత్సాహానికి కీర్తి పథకం అందిస్తున్నామన్నారు. విజ్ఞానదార పేరుతో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేశామన్నారు.

CM Revanth Reddy: హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్..