Etela Rajender: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది మొదటి నుండి దూకుడుగా సాగుతుంది. అక్రమార్జనకు పాల్పడిన వారిపై సామాన్యులు, పేదలు, సినీ, రాజకీయ ప్రముఖులు కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే ఓ డ్రామా అంటూ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఒక మంత్రి గానో, 5 ఎల్లా పాటు సరైన యంపీ గానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డి పేదోళ్ల బాధ తెలిసేది అంటూ మండిపడ్డారు.
Read also: Harish Rao: ఊరంతా విషజ్వరాలే.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హరీష్ రావు ఆగ్రహం
బఫర్ జోన్ లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్ల కు నోటీస్ లు ఎలా ఇస్తారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పడేదో కొత్తగా ఉద్దరిస్తున్నరంటూ నాగేశ్వర్ రావు లాంటి విశ్లేషకులు పోగడడాం సరైనది కాదన్నారు. పేదోళ్ల జోలికి వస్తే మేము ఊరుకొము, ఖబర్దార్ అంటు ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ హస్మత్ పెట్ చెరువు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో అక్కడ వున్నవారు కన్నీళ్లు పెడుతూ ఈటెల రాజేందర్ కు పరిస్థితిని వివరించారన్నారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇల్లు కూల్చాలని చూస్తే ఊరుకోమంటు హెచ్చరించారు.
V. Hanumantha Rao: కంగనా ను కంట్రోల్ చేయండి.. బీజేపీ కి వీహెచ్ సూచన..