NTV Telugu Site icon

Kaushik Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి థ్యాంక్స్‌ చెప్పిన కౌశిక్‌ రెడ్డి..!

Koushik Reddy

Koushik Reddy

Kaushik Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్‌ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు. ఎందుకు ఆపలేక పోయారు ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం .. నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నన్ను ఇంత దారుణంగా తిడుతున్నారు.. మరి గాంధీ మాట్లాడేది భాషేనా..? అని ప్రశ్నించారు. మా విల్లా లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. గాంధీ మొఖం చూసి ఓటేయలేదని.. కేసీఆర్ మొఖం చూసి ఓటేశారని గుర్తు చేశారు. గాంధీ మా ఇంటికి వచ్చి నా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడని తెలిపారు.

Read also: Bonthu Rammohan: కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు

గాలికి పగిలి పోయే.. కిటికీ అద్దాలు పగల గొట్టావని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న సెటైలర్ లు అంటే గౌరవం ఉందన్నారు. చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర..తెలంగాణ అని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమెజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్ లో పడి.. హైడ్రా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్..కి థాంక్స్ .. నా స్థాయికి దిగి వచ్చావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు అంతా.. నాపై స్పందించారని.. నీ స్థాయి..కేటీఆర్..హరీష్ కూడా కాదని అన్నారు. నీ స్థాయి..కౌశిక్ స్థాయి అని నువ్వే నిరూపించావని కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad CP Anand: ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..

Show comments