NTV Telugu Site icon

Kaushik Reddy: డీసీపీ, ఏసీపీ లను సస్పెండ్ చేస్తేనే కంప్లైంట్ ఇస్తా.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Loushik Reddy

Loushik Reddy

Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తల మధ్య పోలీసులు నివాసానికి వచ్చారు. కంప్లైంట్ ఇవ్వండి అంటూ కౌశిక్ రెడ్డి ని అడిగారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇంటి వరకు ఎందుకు అనుమతి ఇచ్చారు అని పోలీసులకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. DCP, ACP లను సస్పెండ్ చేసిన తర్వాతనే కంప్లైంట్ చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. మీరు కంప్లైంట్ ఇస్తేనే ఏదైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపినా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదు. ఇంత మంది పోలీసులు వున్నా ఇంటి గేటు దాటి గాంధీ అనుచరులు దాడి చేశారని మండి పడ్డారు. గోడుగుడ్లు, టామాటాలతో దాడి చేస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. DCP, ACP లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. DCP, ACP లను సస్పెండ్ అయిన తరువాతనే కంప్లైంట్ ఇస్తానని అన్నారు.

Read also: BRS Leaders: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం..

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇంట్లో పనిచేసే ఆడవారికి గాయాలు అయ్యాయి. పలువురు మీడియా ప్రతినిధుకు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే..
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్.. ఇవాళ అమిత్​ షాతో భేటీ..

Show comments