Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు (జనవరి 23) కమిషన్ ఎదట కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టిన ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీని ఎల్ అండ్ టీ నిర్మించగా, అన్నారం బ్యారేజీని ఆప్కాన్స్ నిర్మాణం చేపట్టింది. ఇక, సుందిళ్ళ ప్రాజెక్టును నవయుగ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో ఈ మూడు నిర్మాణ సంస్థలు కమిషన్ ముందుకు విచారణకు రానున్నాయి. నేడు నవయుగ కన్‌స్ట్రక్షన్, రేపు ఎల్ అండ్ టీ, శనివారం నాడు అఫ్కాన్ సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు.
Read Also: GHMC: నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. మేయర్‌పై బీఆర్‌ఎస్ అవిశ్వాసం..?
అయితే, నిన్న జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. అంతకుముందు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా పని చేసిన రామకృష్ణా రావును కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఆయన ఇచ్చిన అఫిడవిట్, కాగ్ స్టేట్‌మెంట్ ఆధారంగా జస్టీస్ పీసీ చంద్రఘోష్ క్వశ్చన్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.