NTV Telugu Site icon

Kaleshwaram Investigation: రేపటి నుంచి రెండు విడతల్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

Pc Ghose

Pc Ghose

Kaleshwaram Investigation: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ రిపోర్ట్ పై జస్టిస్ చంద్రఘోస్ కు వివరణ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. అందులో భాగంగానే కమిషన్ తో కొత్త కోట టీమ భేటీ అయింది. గత డీజీ సీవీ ఆనంద్ సైతం కమిషన్ తో ఒకసారి సమావేశం అయ్యారు. ఇక, కాళేశ్వరం కమిషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని విజిలెన్స్ డీజీ కొత్త కొట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read Also: Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి పైగా విమానాలకు

కాగా, రేపటి నుంచి రెండు విడతలలో బహిరంగ విచారణ కొనసాగనుంది. రేపటి నుంచి పలువురు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ ను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉంది. అయితే, ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలో పలువురుని మళ్ళీ కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్, ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఈ నెలాఖరులోగాNDSA, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ కమిషన్ కు ఆయా సంస్థలు ఇవ్వనున్నాయి. అలాగే, NDSA.. విజిలెన్స్.. CAG అధికారులను కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివర్లో ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వం కమిషన్ నిర్ణయం తీసుకుంది.