NTV Telugu Site icon

K. A. Paul: నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..

Ka Paul

Ka Paul

K. A. Paul: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో పది మంది ఎమ్మెల్యేలపై కేసు వేశానని.. నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను చంపుతామని గతంలో బెదిరించిన వాల్లే పోయారని తెలిపారు. నేను మంచి చేయడానికి వచ్చానని.. నామీద కుట్రలు చేస్తున్నారు.. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నా అన్నారు. నాకు సెక్యూరిటీ దేవుడే అని తెలిపారు. కలలో కూడా మీరు బాగుపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళు కచ్చితంగా చస్తారని తెలిపారు. తెలంగాణా గ్రూప్ వన్ విద్యార్థులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారని.. వాళ్లకు నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోయిందని.. హర్యానా లో 7 హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ హామీలను హర్యానాలో జనం నమ్మలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రేవంత్ రెడ్డి తో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుందన్నారు.

Read also: Kishan Reddy: మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..

డిల్లీ లిక్కర్ స్కాం లా ఏపి లో లిక్కర్ స్కాం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, మాజీ మంత్రులు నేరుగా లిక్కర్ దందాలో వాటాల అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 30లోపు నోబెల్ సమ్మిట్ జరగకపోతే నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడం కష్టమన్నారు. ఏపీ సీఎం కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైంది మనకు దరిద్రం ఎక్కువైందన్నారు. ప్రపంచంలో చైనా వద్దు ఇండియా ముద్దంటున్నారు.. ఏపీలో డ్రగ్స్ ప్రొడక్షన్ జరుగుతుందన్నారు. దేశమంత డ్రగ్స్ సప్లై అవుతుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. సౌత్ కొరియా వెళ్లి టూరిస్ట్ గా తిరిగి వచ్చాడు తెలంగాణ సీఎం అన్నారు. మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చుంటారా? లా ఎక్కడ ఉంది.. ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ కావాలన్నారు. సుప్రీం కోర్టులో పిల్ వేయబోతున్నానని తెలిపారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళను జీవిత కాలం సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ED Raids On Muda office: మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు..