Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) నిదానంగా పోలింగ్ కొనసాగింది. మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ శాతం నెమ్మదిగా ఉంది. గడిచిన రెండు గంటల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 మంది వరకు ఓటేసినట్లు తెలుస్తుంది. అయితే, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో, ఓటర్లు నిదానంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
Read Also: Fire in Travels Bus :షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఇక, వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వెంగళ్ రావు నగర్‌లో మొత్తం 54,620 మంది ఓటర్ల కోసం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ స్లోగా నడుస్తుంది. ఓటర్లు నెమ్మది నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఇక, ఈ ఉప ఎన్నికలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతలో సంతోషం కనిపిస్తోంది. తొలిసారిగా ఓటింగ్ లో పాల్గొనడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, అనంతరం క్రమంగా పుంజుకునే ఛాన్స్ ఉంది.
