Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో కలకలం రేపుతుంది. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ కు చెందిన యజమాని రోజూ లాగానే షాప్ కి వచ్చాడు. అయితే షాప్ తెరవగానే లోపల చిందర వందరగా ఉండటంతో యజమానికి అనుమానం వచ్చింది. షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో యజమాని వెంటనే మేనేజర్ సుకేతుషాకి కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. కాగా సుకేతుషాపై అనుమానం రావడంతో జూవెలరీ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు, జూవెలర్స్ షాప్ యజమానికి అక్కడ వున్న ఆభరాణాల వివరాలను సేకరించారు. ఆభరణాలు మాయం అయినప్పటి నుంచి ఎవరెవరు షాప్ కు రాలేదని పోలీసులు ఆరా తీయగా సుకేతు షా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని తెలిపారు. పోలీసులకు సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకేతుషాపై కేసు నమోదు చేశారు. సుకేతుషా కు షాప్ లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. అతనొక్కడే రూ.6 కోట్ల అభరణాలు మాయాం చేసేంత లేదని తెలిపారు. మేనేజర్ సుకేతు షా తో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరి లపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. పరారీలో లో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసులో ట్విస్ట్..
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ మేనేజర్ సుకేతు షా భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధిస్తున్నారని లెటర్, ఒక వీడియో ఉందని ఫిర్యాదులో భార్య పేర్కొంది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఒక వైపు షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసిన పోలీసులకు సుకేతు భార్య ఫిర్యాదు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు యజమాని, ఇటు పరారీలో వున్న సుకేతు భార్య ఫిర్యాదులను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు