Site icon NTV Telugu

ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం : జానారెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు ఉండేదని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఫైనాన్స్ మినిస్టర్ గా ఎవరున్నా.. రోశయ్య ని ఆదర్శంగా తీసుకోవాల్సిందేనన్నారు.

తెలియని విషయాలను చాలా చక్కగా వివరించేవారని, రోశయ్య ముఖ్యమంత్రి అవగానే… వెంటనే వరదలు వచ్చాయి. అయినా సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఆప్యాయంగా, ప్రేమ గా మాట్లాడేవారని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక… నేను వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నానన్నారు. ఆయన మరణం పట్ల మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. రోశయ్య ఏనాడు పదవులకోసం పాకులాడలేదని, పార్టీ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తియని కొనియాడారు. నేను,రోశయ్య, గీతారెడ్డి సహచర మంత్రులుగా పనిచేసామని, ఎన్నో సమస్యలు పరిష్కరించామన్నారు.

Exit mobile version