Komatireddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో మాటల మంటలు.. జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- డమ్మీ మంత్రి అంటున్నారు నన్ను..
- డమ్మీ మంత్రి నే 20 వేల కోట్లు సంపాదిస్తే..
- ఒరిజినల్ మంత్రి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Vs Jagadish Reddy: ఇవాళ ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. పదేళ్ల విద్యుత్ శాఖపై సోమవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ కొనసాగుతుంది. ఇందో భాగంగా.. జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గా సభ కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందన్నారు. ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరిగానని వ్యాఖ్యానించారు. నిరూపించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేల లేదని తేలితే.. సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలని, రాజకీయాలు వదులుకోవాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలపై సవాల్ చేసేందుకు సిద్ధమన్నారు. ఛైర్మన్ మీద నమ్మకం లేనప్పుడు.. కోర్టుకు పోవడం తప్పా అని ప్రశ్నించారు.
Read also: CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మూడు కేసుల్లోనూ కోర్టులు విచారణ జరిపి నిర్దోషిగా విడుదల చేశాయని బదులిచ్చారు. నేర చరిత్ర చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు. కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడని, సంచులు మోసే చంద్రుడు కాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. డమ్మీ మంత్రి అంటున్నారు నన్ను అని మండిపడ్డారు. డమ్మీ మంత్రినే 20 వేల కోట్లు సంపాదిస్తే.. ఒరిజినల్ మంత్రి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు అన్నారు. కమిషన్ ఛైర్మన్ ఎలా ఉండాలి? అని ప్రశ్నించారు. ఆయన భూ కబ్జా దారుడు అని రేవంత్.. వీహెచ్ అన్నారు. జగదీష్ రెడ్డి పై వున్న కేసులు నిరూపిస్తా.. లేదంటే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి చేసిన సవాల్ ను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వీకరించారు.సభ వాయిదా వెయ్యండి..నల్గొండ ఎస్పీ నుండి వివరాలు తెప్పించండని అన్నారు. దీంతో అసెంబ్లీలో మాటల వార్ కొనసాగింది.
Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..