NTV Telugu Site icon

IT Rides: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు.. 30 చోట్ల తనిఖీలు ..

It Raids

It Raids

IT Rides: హైదరాబాద్‌లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్‌, కొల్లూరు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నాయి. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, మేనేజ్మెంట్ల ఇళ్లల్లో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. చైతన్యపురి లోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.

మలక్ పేట నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షేక్ అక్బర్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు. షేక్ అక్బర్ కు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాసు అచ్యుతరావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన రియల్టర్ల పై ఐటీ సోదాలు చేస్తున్నారు. గుగి ప్రాపర్టీ చెందిన 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం మొత్తం 40 టీములు రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయమే దాడుల కోసం 40 టీములుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.

Read also: Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

హైదరాబాద్‌లో ఐటీ అధికారులు సెప్టెంబరు లో 23న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్ రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్ మెంట్ లోని ‘ఐ బ్లాక్ ’లో అద్దెకు ఉంటున్న ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు జరిగాయి. కాగా.. న్యూస్ ఛానెల్‌తో పాటు ఫైనాన్స్, హాస్పిటల్ ఐటీ సోదాలు నిర్వహించారు.
Astrology: అక్టోబర్ 17, గురువారం దినఫలాలు