NTV Telugu Site icon

HYDRA Effect: అక్రమార్కుల గుండెల్లో ‘హైడ్రా’ దడా.. మీ ఆస్తులు సేఫేనా..?

Hydra Effect

Hydra Effect

HYDRA Effect: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో హైడ్రా పని చేయనుంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తూ.. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది.

Read Also: Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..

ఆపరేషన్ హైడ్రా ప్రారంభమైన దగ్గర నుంచి ఆక్రమణదారుల గుండెల్లో భయం స్టార్ట్ అయింది. ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తుండటతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు వెళ్లడంతో సామాన్యుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. అన్ని పక్కాగా ఉంటే ఓకే.. ప్రభుత్వం భూముల్లో కట్టడాలు నిర్మిస్తే మాత్రం కూల్చివేతలే ఉంటాయనే సంకేతం అందిరిలోకీ వెళ్లింది.

Read Also: Foxconn : రూ.1200కోట్లు పెట్టుబడి పెట్టి 40వేల మందికి ఉద్యోగాలివ్వనున్న సింగపూర్ కంపెనీ

హైదరాబాద్ శివార్ లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ బోర్డులు పెట్టేసి.. యథేచ్ఛగా వెంచర్లు వేసేసి, నకిలీ పత్రాలతో అమ్మకాలు చేసేసి సొమ్ము చేసుకున్నారు. అలాంటి వారి గుండెల్లో ఆందోళన మొదలైంది. తమ భూములు సురక్షితమైనా.. తమ పైనా కూడా హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా అని భయపడుతున్నారు.

Read Also: KTR at Women’s Commission: మహిళా కమిషన్‌ ఆఫీసుకు కేటీఆర్.. కాంగ్రెస్ మహిళా నేతల నిరసన..!

అయితే, మీరు కూడా ఇలానే ఆందోళన పడుతున్నారా.. ఇక ఆ టెన్షన్ ని పక్కన పెట్టి.. మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా లేవా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి.. మీ ఆస్తులు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నాయా లేదా అనేది ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత.. ఇక్కడ లేక్స్ అనే పేజీ ఓపెన్ అవగానే.. జిల్లా, మండలం/సర్కిల్, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే వాటి పరిధిలోని సరస్సులు, చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి.. దీంతో మన స్థలాలు ఎక్కడున్నాయనేది ఈజీగా తెలుస్తుంది. దీని వల్ల మన ఆస్తులపై హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది కూడా సులభంగా తెలిసిపోతుంది.

https://lakes.hmda.gov.in/