NTV Telugu Site icon

Heat Waves: నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

Heat Waves

Heat Waves

Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

Read Also: Mamata Banerjee: లండన్ టూర్‌లో నిరసన సెగ.. తిప్పికొట్టిన సీఎం మమత

అయితే, ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం అయితేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. బయటకు వెళ్ళినప్పుడు టోపీ, గొడుగులు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు. కాగా, ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు మరింత ఎండ వేడిమి పెరిగే ఛాన్స్ ఉంది.. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం చెప్పింది.