NTV Telugu Site icon

Hyderabad: సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫంగస్ వచ్చిన అల్లంతో వంటకాలు..

Hyderabad Food Sefty

Hyderabad Food Sefty

Hyderabad: హైదరాబాద్‌ లో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించట్లేదన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్స్ లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్‌ తిన్నారు.

Read also: TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

అంతేకాకుండా.. హోటల్స్ లో కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్ లో గుర్తించారు. దీనితో వంటకాలు చేస్తున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని హోటల్‌ యాజమాన్యంపై మండిపడ్డారు. హోటల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోటల్‌ ను సీజ్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఫుడ్‌ సెఫ్టీ లేకుండా ఇలాంటి ఆహారం ప్రజలకు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఆహారం తినే భోజన ప్రియులు అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు. పలు హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు హాటల్‌ యాజమాన్యం తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Caste Census Survey: తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..

మరోవైపు ముసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్.. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. కృతుంగ రెస్టారెంట్‌ పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో కూడా ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో చికెన్ కర్రీతో భోజనం చేసిన బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందింది. దీంతో అలర్ట్‌ అయిన అధికారులు ఇవాళ రెస్టారెంట్‌ పై తనిఖీలు నిర్వహించారు.
Sai Durga Tej : పక్కా ప్లానింగుతో ప్యామిలీ ప్యాక్ లేపేసిన మెగా హీరో

Show comments