Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వికారాబాద్ మోమిన్ పేట కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించాడు. స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసి, కించపరిచే విధంగా పోస్టులు చేశాడు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ విషయంపై గతంలో అసెంబ్లీ కార్యదర్శి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..
ఎట్టకేలకు విజయ్ కుమార్ అడ్రస్ ను తెలుసుకుని అతని వద్దకు వెళ్లారు. పోలీసులను చూసిన విజయ్ కుమార్ పరార్ అయ్యేందుకు ప్రయత్నించాడు. అలర్ట్ అయిన పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. విజయ్ కుమార్ ను రిమాండ్ తరలించారు. విజయ్ కుమార్ ఎందుకు స్పీకర్ ను టార్గెట్ చేశాడు? ఈ పోస్టులు పెట్టాలని చెప్పి, వాటిని వైరల్ చేయాలన్న కీలక సూత్రదారులు ఎవరన్న విషయాలను సైబర్ పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో మరి కొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.
Monarch Tractor: హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక..