Khairatabad Ganesh: ఇవాళ రోజు కావడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే, ఈరోజు రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి కలశపూజ నిర్వహించనున్నారు. అలాగే, ఖైరతాబాద్ గణనాథుడికి షెడ్ వర్క్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక టస్కర్ కి వెల్డింగ్ పనులు కొనసాగిస్తున్నారు. బడా గణేష్ 40 టన్నుల భారీ వినాయకుడినీ టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఆ తరువాత దాదాపుగా రెండు గంటలు వెల్డింగ్ పనులు కొనసాగుతాయి. అనంతరం పూజలు నిర్వహించి రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2గంటల లోపు బడా గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేస్తామని ఉత్సవ నిర్వాహకులు అంటున్నారు.
Read Also: Body Builders Fighting: అసలే బాడీ బిల్డర్స్.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు..!
ఇక, 1954లో మొదటి సారి ఖైరతాబాద్ లో అడుగు ఎత్తులో బడా గణేషుడిని ప్రతిష్టించారు. ఆ తర్వాత సంవత్సరం.. సంవత్సరం అడుగు మేర ఎత్తు పెంచిన నిర్వాహకులు.. ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో సప్తముఖ మహా శక్తి మట్టి గణపతిగా దర్శనం ఇచ్చారు. 1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2 వేల మీటర్ల నూలు వస్త్రం, 2 వేల మీటర్ల జూట్ ను ఉపయోగించి బడా గణేషుని రూపొందించారు. 70 ఈ సంవత్సరాలైన సందర్భంగా 7 తలలు, 7 సర్పాలు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇచ్చారు. గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో బాల రాముడి ప్రతిష్ఠ.. 78 రోజులలో బడా గణేషుని తీర్చిదిద్దారు.