NTV Telugu Site icon

Musi River: మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు.. నేటి నుంచి షురూ..

Musi River

Musi River

Musi River: హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇవాళ ఉదయం నుంచి కూకట్ పల్లిలోని నల్లచెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు. తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమను కూల్చివేతలకు సిద్దమైంది. ఇవాళ మూసీ పరీవాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరుగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వ నిర్ణయింది. కోకాపేటలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించింది. సర్వే నంబర్‌ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.
Flyover Collapse: ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్!