NTV Telugu Site icon

Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు..

Hyderabad Rode Acident

Hyderabad Rode Acident

Hyderabad Road Accident: రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాద మరణాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలకు సిద్ధమవుతున్నా ఫలితం లేకుండా పోతుంది. రోజుకు ఎక్కడో ఒకచోట ప్రమదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాల నగరంలో రెండు చోట్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

Read also: Fraud: ప్రముఖ పారిశ్రామికవేత్తను మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.7కోట్లు

మాసబ్ ట్యాంక్ లోని ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్ స్టార్టింగ్ వద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన క్యాబ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఉద్యోగస్తులను తీసుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ముందు సీట్లో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి తేజ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. సాయితేజ మృతి దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపారు.

Read also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?

రాజేంద్రనగర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఓఆర్‌ఆర్‌పై వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం కింద పడింది. ఈ ప్రమాదంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న నీలయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read also: Fraud: ప్రముఖ పారిశ్రామికవేత్తను మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.7కోట్లు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. డివైడర్ ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెంది గా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట కు చెందిన మజ్జి శ్రీకాంత్, మున్నూరు నరేష్ తమ ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు వెళ్తుండగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఆత్వెల్లి మసీదు వద్ద డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన నరేష్ ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
OTT Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు