భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మబ్బు.. మబ్బుగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ అంతటా కుండపోత వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఇక గచ్చబౌలిలో అయితే వడగళ్ల వాన కురుస్తోంది. ఎస్‌ఆర్.నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్, లింగంపల్లి, సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు రోడ్లపై చేరుకున్నాయి. సాయంత్రం డ్యూటీలు దిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
- హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
- రోడ్లన్నీ జలమయం
- వాహనదారులకు ఇక్కట్లు

Rain