NTV Telugu Site icon

భాగ్యనగరంలో మళ్లీ నుమాయిష్ సందడి

కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో నుమాయిష్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసింది. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బి.ప్ర‌భాశంక‌ర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ స‌ర్వీసెస్, విద్యుత్, రోడ్ల భ‌వ‌నాల శాఖ‌ల నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంది.

Read Also: దేశంలోనే తొలి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ

ప్ర‌తి ఏడాది నుమాయిష్‌ను జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే నుమాయిష్‌లో ప్ర‌తి ఏడాది దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది త‌క్కువ సంఖ్య‌లో స్టాళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. క‌రోనా దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వ‌చ్చే స్టాళ్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌నున్నారు. నుమాయిష్ ద్వారా ప్ర‌భుత్వానికి దాదాపు రూ. 15 కోట్ల ఆదాయం స‌మ‌కూరే అవ‌కాశం ఉంది.