Site icon NTV Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

Rain

Rain

భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మబ్బు.. మబ్బుగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌ అంతటా కుండపోత వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్‌, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఇక గచ్చబౌలిలో అయితే వడగళ్ల వాన కురుస్తోంది. ఎస్‌ఆర్.నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌, లింగంపల్లి, సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు రోడ్లపై చేరుకున్నాయి. సాయంత్రం డ్యూటీలు దిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  దీంతో చీకట్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో భాగ్యనగరంలో వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చల్లని గాలులతో ఉల్లాస భరితంగా మారింది. నగర వాసులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉక్కపోత నుంచి చిన్నారులు, పెద్దలు ఉపశమనం పొందుతున్నారు.

ఇది కూడా చదవండి: Lok sabha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. ఈ సెషన్స్‌లో లేనట్టే! కారణాలేంటంటే..!

ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!

Exit mobile version